Gujarat Man Rapes Sister Twice Over Her Relationship: మానవ సంబంధాలకు మచ్చ తెచ్చిన ఒక అత్యంత దారుణమైన ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ప్రేమిస్తోందనే కోపంతో సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. కత్తితో బెదిరించి, సిగరెట్లతో కాల్చి తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు.
ఏం జరిగిందంటే..
22 ఏళ్ల బాధితురాలు మూడేళ్లుగా ఒక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయం తెలిసిన 29 ఏళ్ల ఆమె అన్న, దీనిని జీర్ణించుకోలేకపోయాడు. చెల్లి ప్రేమబంధాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ALSO READ: Suicide Attempt: సౌదీలో ముగ్గురు కుమారులను చంపి, సూసైడ్‌కు యత్నించిన హైదరాబాద్ మహిళ
జులై 13న, తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ భయంకరమైన అనుభవాన్ని దిగమింగుకుని, జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా భయంతోనే గడిపింది ఆ యువతి.
కానీ, ఈ సంఘటనతో ఆ కసాయి అన్నలో ఎలాంటి పశ్చాత్తాపం కలగలేదు. ఆగస్టు 22న తన భార్య పని మీద బయటకు వెళ్లినప్పుడు మళ్ళీ ఇదే అకృత్యానికి పాల్పడ్డాడు. ఈసారి మరింత క్రూరంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేస్తూ, మండిన సిగరెట్‌తో ఆమె తొడపై కాల్చి గాయాలు చేశాడు.
ఈ మానసిక, శారీరక క్షోభను తట్టుకోలేకపోయిన బాధితురాలు ధైర్యం చేసి మహిళా హెల్ప్ లైన్‌ను ఆశ్రయించింది. తనపై జరిగిన దారుణాన్ని వివరించి, న్యాయం చేయాలని వేడుకుంది.
ALSO READ: Woman Harassed: వస్తావా అంటూ యువతిపై ఏడేళ్ల బాలుడి కామెంట్
హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు.
కుటుంబ బంధాలు, ఆత్మీయతలు ఉండాల్సిన చోట ఇలాంటి అమానుష ఘటనలు జరగడం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెల్లి పట్ల ఆప్యాయత, రక్షణ కల్పించాల్సిన అన్నే ఆమె జీవితాన్ని నాశనం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు, మానవ సంబంధాల విలువలు క్షీణిస్తున్న తీరుకు ఇది ఒక అద్దం పడుతుంది. సమాజంలో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తుంది.


