Homeనేరాలు-ఘోరాలుHayathnagar: కార్పెంటర్ టూ ఘరానా దొంగ.. బెట్టింగ్ మోజులో 69 చోరీలు!

Hayathnagar: కార్పెంటర్ టూ ఘరానా దొంగ.. బెట్టింగ్ మోజులో 69 చోరీలు!

ఎల్బీనగర్​( తెలుగుప్రభ): తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా గత పదేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వరుస చోరీలతో బెంబేలెత్తిస్తున్న ఘరానా దొంగను హయత్‌నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్​ చేశాకు. రిమాండ్‌కు తరలించారు. ఈ ఘరానా దొంగ అరెస్ట్‌తో హయత్‌నగర్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన 4 కేసుల మిస్టరీ వీడింది. నిందితుడి నుంచి సుమారు 42.3 తులాల బంగారు ఆభరణాలు, 87 తులాల వెండి వస్తువులు, రూ. 42 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మంగళవారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో వనస్థలిపురం డివిజన్​ ఏసీపీ కాశిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

జైలుకెళ్లి వచ్చినా.. మళ్లీ దొంగతనాలే: వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా జీడిమెట్లకు చెందిన శ్రీరామ్ నరసింహాచారి అలియాస్ నయామి అలియాస్ రాజేశ్​ (39) ఏడో తరగతి వరకు చదవుకున్నాడు. కార్పెంటర్‌గా పనిచేస్తూ.. జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గతంలో పలుమార్లు పోలీసులుకు పట్టుబడి జైలుకు వెళ్లొచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రతిసారీ పాత బుద్ధినే ప్రదర్శించేవాడు. గడిచిన ఏప్రిల్ నెల నుంచి హయత్‌నగర్, మునగనూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను రెక్కీ చేసి మరీ దొంగతనం చేశాడు. స్క్రూడ్రైవర్, గ్లోవ్స్, ఫేస్‌మాస్క్‌లతో పక్కా ప్లాన్‌తో తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి దోపిడీలకు పాల్పడేవాడు. అలా దొంగిలించిన సొత్తును ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులకు విక్రయించాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పూర్తిగా ఖర్చుచేసేవాడని విచారణలో తేలింది.

Also read-Crime: బాలాపూర్‌లో దారుణం.. నమ్మించి నరికి చంపిన స్నేహితులు!

పోలీస్ బృందానికి డీసీపీ అభినందనలు: నరసింహాచారిపై తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఇప్పటికే 69 కేసులు నమోదై ఉన్నాయి. పేట్‌బషీరాబాద్, నేరేడ్‌మెట్, బోయిన్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, చందానగర్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇళ్ల చోరీలకు పాల్పడిన చరిత్ర ఇతడికి ఉంది. ఇటీవల మునగనూరు పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా హయత్​నగర్​ పోలీసులు చాకచక్యంగా ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీ, పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకుని వరుస కేసులను ఛేదించిన హయత్‌నగర్ పోలీసు బృందాన్ని ఎల్‌బీనగర్ జోన్ డీసీపీ డా. బి. అనురాధ అభినందించారు. ఈ కేసు ఛేదనలో వనస్థలిపురం ఏసీపీ పి. కాశిరెడ్డి, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. శంకరయ్య, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. సంతోష్ కుమార్, క్రైమ్ స్టాఫ్ ను ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News