Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుHusband attacks on Wife: భార్య గొంతు కోసిన సైకో భర్త.. తప్పిన ప్రాణాపాయం

Husband attacks on Wife: భార్య గొంతు కోసిన సైకో భర్త.. తప్పిన ప్రాణాపాయం

Husband attacks on Wife in Nagole: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నాగోల్‌లో దారుణం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆస్పత్రి పాలైంది. దంపతుల మధ్య మొదలైన గొడవలో భార్యను అతి క్రూరంగా గొంతు కోశాడు భర్త. ఆమె గట్టిగా వేయడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతోంది. 

- Advertisement -

ప్రస్తుతం సమాజంలో దాంపత్య జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. అదనపు కట్నం తేవాలంటూ ఓ వైపు భార్యలకు భర్తలు, అత్తింటి వారు నరకయాతన చూపిస్తుంటే.. మరోవైపు వివాహేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వామిని చంపడానికి సైతం వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాకుండా పిల్లలను చంపడానికి కూడా వెనకాడటం లేదు.  

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-techie-hospitalized-pani-puri-hepatitis-a/

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింతగా పెరిగిందనే చెప్పాలి. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను ముక్కలుగా నరికి మూసీ నదిలో భర్త పడేసిన ఘటన హైదరాబాద్‌లో ఇటీవలే చోటుచేసుకుంది. ఇది మరువక ముందే ఆదివారం నాగోల్‌లో జరిగిన ఘటన.. తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి(20), వేణుగోపాల్‌కు పెద్దల సమక్షంలో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంగా రూ. 20 లక్షలు ఇచ్చారు.  కొన్ని రోజుల పాటు కాపురం సజావుగానే సాగింది. ఇక పెళ్ళైన నెల నుంచే భర్త తన భార్యను చితకబాదుతూ మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా అదనపు కట్నం కావాలని వేధించేవాడు. 

Also Read: https://teluguprabha.net/crime-news/bengaluru-couple-kills-2-children-then-plans-to-die-by-suicide-wife-survives-and-is-in-custody/

తాగుడుకి బానిసైన వేణుగోపాల్‌.. భార్య నగలను సైతం అమ్ముకున్నాడు. దీంతో మిగిలిన నగలను మహాలక్ష్మీ పుట్టింట్లో దాచిపెట్టింది. వాటిని కూడా తెమ్మని భార్యను వేధించడంతో ఆమె తన గోడును తల్లిదండ్రులకు చెప్పుకొంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. 

Also Read: https://teluguprabha.net/crime-news/suspicious-death-of-a-young-man-in-anakapalle/

 ఈ క్రమంలో ఆదివారం బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో వెళదామని భార్య కోరింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై కోపంతో బ్లేడు తీసుకుని భర్త ఆమె గొంతు కోశాడు. మహాలక్ష్మి గట్టిగా వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో బాధితురాలు చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న నాగోల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad