Husband dies after wife passes away: జీవితంలో ఎన్ని కష్టసుఖాలు వచ్చినా కడదాక నీతోనే అంటూ వివాహ సమయంలో దంపతులిద్దరు ఒకరికొకరు అగ్ని సాక్షిగా మాటిచ్చుకుంటారు. కలలో అయినా.. కలయికలో అయినా.. కలిసుండని కాలాలైనా ఒకరికొకరు తోడు ఉండాలని అనుకుంటారు. ఇలా ఒకరికొకరు ఇచ్చుకున్న మాట విధంగానే ఆ దంపతులు చితిమంటల్లోకి సైతం ఒక్కటిగా వెళ్లిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.
కంటికి రెప్పలా: వాళ్ళిద్దరు అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని చుట్టుపక్కలవారు అనునిత్యం అనేవారు. సరిగ్గా అలానే జరిగింది. కొంతకాలం క్రితం భర్త అనారోగ్యం బారినపడి మంచం పట్టాడు. కదలలేని పరిస్థితిలో ఉన్న భర్తకు భార్య సపర్యాలు చేసింది. కొన్ని ఏళ్ల నుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. జీవిత భాగస్వామి కోసం ఎన్నో కష్టాలను సైతం ఆ భార్య దిగమింగుకుంది. అయితే కొంతకాలంగా ఆ భార్య ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందింది. భార్యను పిలిచి పిలిచి తన భార్య తనకు లేదనే మనస్థాపంతో.. నీ వెంటే నేనంటూ భార్యతోపాటు భర్త మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని అనంతారం గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read:https://teluguprabha.net/crime-news/woman-arrested-for-prostitution-in-begumpet-cemetery/
ఆదర్శనీయమైన జంట: జగిత్యాల జిల్లా రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మి, రాజనర్సులది ఆదర్శనీయమైన జంట. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. సుమారు 20 ఏళ్ల క్రితం రాజనర్సు వృత్తిరీత్యా కనకబొంగులు తీసుకురావటానికి వెళ్లి.. గాయపడి మంచం పట్టారు. అప్పటి నుండి లక్ష్మి ఆయనకు అన్నీ తానే అయ్యింది. భార్యగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితురాలిగా ఇలా అన్ని పాత్రలూ పోషిస్తూ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది.
నీ వెంటే నేను వస్తున్నా: కొంత కాలంగా లక్ష్మి ఆరోగ్యం దెబ్బతింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. భార్య మరణాన్ని తట్టుకోలేని రాజనర్సు.. “నీ వెంటే నేను వస్తున్నా” అంటూ తీవ్ర మనస్తాపంతో ఆమె మరణించిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు.. మరణంలోనూ విడిపోకుండా ఒకేసారి ఒకే పాడెపై అంతిమయాత్రకు తరలివెళ్లారు. బతికి ఉన్నప్పుడు కష్టాలను కలిసి ఎదుర్కొని.. మరణంలోనూ విడదీయరాని బంధాన్ని చాటుకున్న ఈ జంట కథ ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించింది.


