హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ ప్రధాన రహదారి ఉన్నట్టుండి కుంగిపోయింది. దీంతో రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించటంతో పెద్ద ముప్పు తప్పింది. తక్షణం కుంగిన భాగాన్ని బ్లాక్ చేసి.. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లో వేలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాగా ఇటీవలి కాలంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లు ఇలా కుంగిపోవటం రొటీన్ గా మారింది. ఆమధ్య ట్యాంక్ బండ్, ఓల్డ్ సిటీల్లోని పలుచోట్ల ఇలా జరిగింది.
Hyd: హైదరాబాద్ లో కుంగిన రోడ్డు..రద్దీ రోడ్లలో షరామామూలుగా మారిన వ్యవహారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES