Tuesday, September 10, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd-GHMC raids on Telugu Medium restaurant- తెలుగు మీడియం రెస్టారెంట్ పై ఫుడ్...

Hyd-GHMC raids on Telugu Medium restaurant- తెలుగు మీడియం రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

ఇదండీ మన రెస్టారెంట్స్ నిర్వాకం..

జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ఆహార విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ పై గురువారం దాడి చేశారు. రెస్టారెంట్ లో మాంసాహార ప్రియులకు వడ్డించిన బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ దాడి నిర్వహంచినట్లు తెలిసింది.

- Advertisement -

కాలం చెల్లిన జ్యూస్, మష్రూమ్స్ తదితర వాటిని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి శ్యాంపిల్స్ ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. వెజ్, నాన్ వెజ్ వస్తువులను రిఫ్రిజిరేటర్‌లో చాలా రోజుల నుంచి కలిపి నిల్వ ఉంచినట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మేరకు రెస్టారెంట్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటామన్న జిహెచ్ ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News