Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు

Hyd: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు

ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు. హైదరాబాదులో నరమేధం సృష్టించేందుకు కుట్రపన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జాహీద్ తో పాటు ముగ్గురిని గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు. జాహీద్ కు ఆర్థిక సాయం చేసిన అబ్దుల్ కలీమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాహీద్ కు 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం అబ్దుల్ కలీం చేసినట్టు పోలీసులు గుర్తించారు.
కలీం ఇచ్చిన 40 లక్షల రూపాయల తో కార్లు బైకులు కొనుగోలు చేశాడు జాహీద్. విదేశాలను వచ్చిన హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు కుట్ర పన్నింది జాహీద్ ముఠా. కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడుకు కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనే పోలీసులు ఈ కుట్రని భగ్నం చేయగా..ఈకేసు విచారణ ఎన్ఐఏ చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News