Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: అక్రమ బంగారం గుట్టు రట్టు

Hyd: అక్రమ బంగారం గుట్టు రట్టు

రాజేంద్రనగర్ లో ఎస్ ఓ టీ పోలీసుల చేసిన దాడుల్లో అక్రమంగా బంగారం విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల వద్ద భారీగా విదేశీ బంగారం పట్టివేశార ఎస్ఓటీ పోలీసులు. ఈ దాడుల్లో సుమారు 50 లక్షల విలువ చేసే అక్రమ బంగారం సీజ్ చేశారు. SOT, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో.. విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లి అక్రమంగా బంగారం తరలించిన కేటుగాడు చిక్కాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల‌ కళ్లు గప్పి బంగారం తరలించే ప్రయత్నం చేశాడు. విదేశీ బంగారాన్ని మైలార్ దేవిపల్లిలో కొంత మందికి విక్రయించే ప్రయత్నం చేయగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేపట్టగా, విదేశీ బంగారు బిస్కెట్ల ను విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి పై అక్రమ బంగారం రవాణా సెక్షన్ కింద సయ్యద్ మొయిజ్ పాషా, సమీర్ ఖాన్, మహ్మద్ అర్షద్ ల అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News