Sunday, June 30, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది?

Hyd: మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది?

“ఇది ఇక్కడి పరిస్థితి.. మా ఇళ్ల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటాడండీ”.. అంటూ మంచు మనోజ్.. తన అన్న మంచు విష్ణుపై సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.  దీంతో మంచు మోహన్ బాబు ఇంట్లో గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.  ఆశ్చర్యకరంగా కాసేపటి తరువాత మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు..కానీ అప్పటికే ఆ వీడియో ఎప్పుడో వైరల్ అయిపోయింది.  అయితే సోషల్ మీడియాలో ఇలా ఎందుకు వీడియోను షేర్ చేశావంటూ మోహన్ బాబు మనోజ్ ను తిట్టడంతోనే ఆయన వీడియో డిలీట్ చేశారు.

- Advertisement -

మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దే పనిని తన కుమార్తె మంచు లక్ష్మికి అప్పగించారు మోహన్ బాబు.  తక్షణం రంగంలోకి దిగిన ఆమె వ్యవహారం చక్కబెట్టే పనిలో తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.  పైగా లక్ష్మి మాటను తమ్ముడు మనోజ్ తూ.చ. తప్పకుండా వెంటాడు కాబట్టి ఆమెనే ఈ పరిస్థితిని సరిదిద్దగల సమర్థురాలిగా మోహన్ బాబు భావిస్తున్నారు.

ఇక వివాదాల్లోకి వస్తే అత్యంత దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీలో మంచు విష్ణుకు ముద్ర పడింది.  మా ఎన్నికల్లోనూ ఆయన చేయి చేసుకోవటం కెమరాల సాక్షిగా జరిగింది.  ఇక గత కొంతకాలంగా అన్నాదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఈమధ్యనే రెండో వివాహం చేసుకున్న మనోజ్ పెళ్లికి కూడా విష్ణు కొన్ని నిమిషాలపాటు అతిథిగా వచ్చి వెళ్లారంతే. 

అయితే ఆవేశంలో ఉన్న విష్ణుకు విషయం అర్థం కావటం లేదని, ఈ ఆవేశంతో తాను చాలా నష్టపోయానని మోహన్ బాబు సర్దిచెప్పినా ప్రయోజనం లేకపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News