Hyderabad : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో తండ్రీ – కొడుకులు మరణించడం కలకలం రేపింది. ఆదివారం వెస్లీ కాలనీ వాసులు గణేష్ నిమజ్జనం చేయడానికి వెళ్లిన శ్రీనివాస్ తన కుమారుడితో ఆటోలో వెళ్లారు. నిమజ్జనం పూర్తయ్యాక అందరూ ఇంటికి చేరుకున్నారు, కానీ శ్రీనివాస్, అతని కుమారుడు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్‌గా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ALSO READ : Pawan Kalyan : చంద్రబాబు నాయుడు భవిష్యత్ దార్శనికుడు – పవన్ కల్యాణ్
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, చెరువు ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు. చెరువు సమీపంలో రాళ్లు చిందరవడం గమనించిన వారు, వాహనం చెరువులో పడిపోయి ఉండవచ్చని అనుమానించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సహాయంతో గాలింపులో తండ్రీ-కొడుకుల మృతదేహాలను బయటకు తీశారు. నిమజ్జనం తర్వాత ఇంటికి వస్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి చెరువులో పడిపోయి వారు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ALSO READ : Prayagraj:దుష్టశక్తులున్నాయని నమ్మి..సొంత మనవడినే బలిచ్చిన తాత
మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దుర్ఘటనతో దుండిగల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ ఆకస్మిక ఘటనపై షాక్ అయ్యారు. పోలీసులు రోడ్డు పరిస్థితులు, వాహన అదుపు కోల్పోవడం వంటి కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన సందర్భంగా జాగ్రత్తలపై చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ నేపథ్యంలో “వినాయక నిమజ్జనం ఒక పవిత్రమైన, ఆనందకరమైన సందర్భం. అయితే, ఈ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముందుగా, నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు పాటించండి. గణేశ విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు నీటి లోతు, ప్రవాహం గురించి తెలుసుకోండి. చిన్నపిల్లలు, వృద్ధులు జలాశయాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ఉపయోగించండి. రద్దీ నివారించడానికి నిర్వాహకుల సూచనలు పాటించండి. విద్యుత్ తీగలు, రసాయనాల నుండి దూరంగా ఉండండి. సురక్షితమైన, పర్యావరణ హితమైన నిమజ్జనంతో వినాయకుని ఆశీస్సులు పొందండి” అంటూ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు.


