HomeTop StoriesSmuggling: శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

Smuggling: శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

Shamshabad Airport Customs Drug Bust : శంషాబాద్‌ విమానాశ్రయం.. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. అయితే, స్మగ్లర్లకు మాత్రం ఇది అక్రమ రవాణాకు అనువైన మార్గంగా కనిపిస్తోంది! బ్యాంకాక్‌ నుంచి పకడ్బందీగా రూ. 10 కోట్ల విలువైన 10 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడి ఆటను కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా కట్టించారు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినా సరే, తమ డేగకళ్లతో స్మగ్లర్‌ బాగోతాన్ని రట్టు చేశారు. 

- Advertisement -

అనుమానం.. అణువణువూ తనిఖీ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో బ్యాంకాక్ నుంచి ఓ విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. విమానం దిగి లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక వ్యక్తి కదలికలు కస్టమ్స్ అధికారులకు తీవ్ర అనుమానం తెప్పించాయి. ఎవరికీ చిక్కకుండా, చాలా ఆత్మవిశ్వాసంతో కస్టమ్స్ క్లియరెన్స్ దాటేందుకు అతడు ప్రయత్నించాడు. అతని ప్రవర్తనలో ఆందోళనను పసిగట్టిన అధికారులు, అతన్ని అడ్డుకుని ప్రాథమిక విచారణ ప్రారంభించారు.

Also Read: https://teluguprabha.net/telangana/telangana-anganwadi-recruitment-15982-posts-notification/

గుట్టు రట్టు.. పది కిలోల పచ్చిక : ప్రయాణికుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు అతడి లగేజీని స్కానింగ్ యంత్రాల్లో నిశితంగా పరిశీలించారు. స్కానర్‌లో లగేజీ బ్యాగ్‌ అడుగు భాగంలో, అలాగే ఫుడ్ బాక్సుల్లో కొన్ని అనుమానాస్పద పొట్లాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాగును తెరిచి చూడగా అసలు గుట్టు రట్టయింది. అత్యంత ఖరీదైన, విదేశాల్లో సాగుచేసే ‘హైడ్రోపోనిక్ గంజాయి’  అందులో బయటపడింది. ఏకంగా 10 కిలోల గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేశాడు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/urban-challenge-fund-rs-5681-crores-warangal-karimnagar-khammam/

కటకటాల వెనక్కి.. అంతర్జాతీయ ముఠా కోసం వేట: కస్టమ్స్ అధికారులు వెంటనే గంజాయిని సీజ్ చేసి, ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్  చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో పలు దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూసినట్లు సమాచారం. ఈ స్మగ్లింగ్ వెనుక కేవలం ఆ వ్యక్తి మాత్రమే లేడని, బ్యాంకాక్‌ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్న ఓ భారీ అంతర్జాతీయ ముఠా హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు బలంగా భావిస్తున్నారు. అమాయక ప్రయాణికులకు సులభంగా డబ్బు ఆశ చూపి, ఇలా ‘డ్రగ్ కొరియర్లుగా’ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రయాణికుడి కాల్ డేటా ఆధారంగా బ్యాంకాక్‌లో అతడు ఎవరిని కలిశాడు? హైదరాబాద్‌లో ఈ సరుకు ఎవరికి డెలివరీ చేయాల్సి ఉంది? అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News