IAS Aspirant Shot Dead in Suspected ‘Honour Killing’: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కన్న ఓ యువతి, తన సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలో, ఐఏఎస్ కావాలని పగలు, రాత్రి కష్టపడిన మాన్వి మిశ్రా (24) పరువు హత్యకు బలి అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమె తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ALSO READ: Man Kills Minor Fiancée: మైనర్‌తో ప్రేమ.. నిశ్చితార్థం.. గొడవపడి గొంతు నులిమి చంపేసిన ప్రియుడు
మాన్వి తల్లిదండ్రుల ఇంట్లో ఆమె మృతదేహం కనిపించడంతో, కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. కానీ పోలీసుల అనుమానం బలపడడంతో ఫోరెన్సిక్ పరీక్ష చేయించారు. ఫలితాలు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. బుల్లెట్ ఎడమ వైపు నుంచి తలలోకి దూసుకుపోగా, మాన్వి కుడి చేతిలో తుపాకీ కనిపించింది. మామూలుగా కుడిచేతివాటం ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, బుల్లెట్ కుడి వైపు నుంచి ప్రవేశిస్తుంది. ఈ తేడాతో పోలీసులకు ఇది ఆత్మహత్య కాదని స్పష్టమైంది.
ALSO READ: Crime : ప్రియుడి మోజులో పడి భర్త, 22 ఏళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి!
తదుపరి విచారణలో, మాన్వి కుటుంబం చెప్పిన దానికి, నిజానికి పొంతన లేదని తేలింది. ఈ ఏడాది జనవరిలో మాన్వి తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వ్యక్తిని, అంటే బరేలీకి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభినవ్ కతియార్‌ను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె కుటుంబం ఆగ్రహంతో రగిలిపోయి ఉంటుందని, అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ALSO READ: Nagar Kurnool : దారుణం.. ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి కాల్చి చంపి, తండ్రి ఆత్మహత్య!
పోలీసులు ఆమె సోదరుడు అశుతోష్ మిశ్రాను నిలదీయగా, తానే దేశవాళీ తుపాకీతో మాన్విని కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఈ కుట్రలో ఆమె తల్లి కూడా భాగం కావడంతో, ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. దేశ భవిష్యత్తు కోసం కలలు కన్న ఓ యువతి, పరువు పేరుతో కన్నుమూయడం విషాదకరం.
ALSO READ: Medak : నువ్వులేని జీవితం వద్దు! ప్రేమ నిరాకరించాడని యువతి ఆత్మహత్య


