Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుIllandukunta: అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు

Illandukunta: అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు

హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సమావేశాలకు ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి అని హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికలు జరిగేంత వరకు ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటే తప్పకుండా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. డీజేలకు అనుమతి లేదని పోలీస్ శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే డీజేను సీజ్ చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సభలు సమావేశాలు నిర్వహించాలనుకున్న ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో జమ్మికుంట గ్రామీణ సిఐ కిషోర్, ఇల్లందకుంట ఎస్సై రాజ్ కుమార్, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News