Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుIllanthakunta: ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్

Illanthakunta: ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్

తాగుడుకి బానిసై..

ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో గొల్లపల్లి రమేష్ కి చెందిన ద్విచక్ర వాహనం ఏపీ 15 బిజి 7295 ను గుర్తు తెలియని వ్యక్తి పోచమ్మ గుడి దగ్గర దొంగలించాడు. వాహనదారు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జంగంరెడ్డి పల్లె కమాన్ దగ్గర ఒక వ్యక్తి బండితో అనుమానస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా అతని పేరు వల్లెపు దేవాదాస్ (సిద్దిపేట) అని తెలిసింది. అతడు తాగుడుకి బానిస అయి, గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నట్లు తెలిసింది. అతడు గురువారం రోజు అనంతగిరిలో ద్విచక్ర వాహనం దొంగలించినట్లు తెలిపాడు. ఇతని దగ్గర నుండి వెంటనే ద్విచక్ర వాహనంను స్వాదినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై ఇది వరకు సిద్దిపేటలో కూడా రెండు కేసులు ఉన్నట్లు విచారణలో తెలియగా, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ కదిరె శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News