Student Create Porn Pics of Women Students Using AI: ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లోని అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 36 మందికి పైగా మహిళా విద్యార్థినుల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడనే ఆరోపణలతో మూడవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
బిలాస్‌పూర్‌కు చెందిన ఈ విద్యార్థి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో చదువుతున్నాడు. సోమవారం 36 మంది విద్యార్థినులు అతనిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ: Shocking news: కాలేజీ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిపోయిన మృతదేహం:10 రోజులుగా అదే నీరు తాగిన విద్యార్థులు
తక్షణ విచారణ కమిటీ ఏర్పాటు
“అక్టోబర్ 6న కొందరు మహిళా విద్యార్థులు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేసి, సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి గదిలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థికి చెందిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, మరియు పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నాము” అని ఇన్‌స్టిట్యూట్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు.
ALSO READ: Bengaluru crimes: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. భోజనానికి పిలిచి స్టూడెంట్ పై లైంగిక దాడి!
నిందితుడి ఎలక్ట్రానిక్ పరికరాల్లో 1,000కి పైగా విద్యార్థినుల మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు నిల్వ ఉన్నట్లు కళాశాల అధికారులు గుర్తించారు. ఈ అశ్లీల కంటెంట్ డిజిటల్‌గా రూపొందించబడిందా లేదా అనేది నిర్ధారించడానికి మరియు వాటిని బయట ఎక్కడైనా పంచుకున్నారా అనే విషయంపై దర్యాప్తు చేయడానికి తాము సైబర్ నిపుణులతో సమన్వయం చేసుకుంటున్నామని రిజిస్ట్రార్ తెలిపారు.
పోలీస్ ఫిర్యాదు కోసం ఎదురుచూపు
తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిన వెంటనే అధికారిక దర్యాప్తు ప్రారంభిస్తామని రాఖీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆశిష్ రాజ్‌పుత్ తెలిపారు. విద్యార్థినులు, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారి వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా చూస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. విద్యార్థిపై తగిన క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ALSO READ: Techie Dies by Suicide: 6 నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఆ కారణంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్


