Student Suicide at Barrage: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ విద్యార్థిని బ్యారేజీపైన ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతసేపు మొబైల్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం యువతి వెనుకకు నడుస్తూ ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి దూకింది.
ये जिंदगी ना मिलेगी दोबारा!#सहारनपुर की शिवानी (18) नहर में कूदकर जान दे दी
वह कूदने के लिए रैंप पर खड़ी थी. लोग उसे समझाते रहे वह नही मानी. सिर को स्कार्फ से ढक. पानी कूद गयी. रस्सा फैंका गया, लड़के नहर में भी कूदे. मगर वह पानी में बैठ गयी. शव बरामद है pic.twitter.com/t06Vi3IJq5
— Narendra Pratap (@hindipatrakar) September 12, 2025
యూపీలోని సహరాన్‌పూర్ జిల్లాలో హత్నికుండ్ బ్యారేజ్ వద్ద గురువారం మధ్యాహ్నం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బ్యారేజ్ వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు.. తమ సెల్‌ఫోన్‌లో కాలువ ప్రవాహాన్ని చిత్రీకరిస్తుండగా బ్యారేజ్‌పైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రికార్డయింది. వెంటనే అక్కడున్న కొందరు యువకులు నదిలోకి దూకి ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది.
రతన్‌పురా కళ్యాణ్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఐటీఐ విద్యార్థిని సెప్టెంబర్ 11న మధ్యాహ్నం హత్నికుండ్ బ్యారేజీ వద్దకు వచ్చింది. కొద్దిసేపు మొబైల్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం.. అకస్మాత్తుగా కాలువ వైపు తిరిగింది. సడెన్‌గా వెనుకకు నడుస్తూ నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన అక్కడున్న ముగ్గురు యువకులు.. యువతిని రక్షించేందుకు తాళ్ల సాయంతో నీటిలోకి దూకారు. అయితే నీటి ప్రవాహం బలంగా ఉండటంతో విద్యార్థిని కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న ప్రతాప్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల తర్వాత యువతి మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. కాగా, ఆ యువతి బ్యాగ్‌లో ఉన్న ఆధార్ కార్డు, ఇతర పత్రాల ఆధారంగా మృతురాలిని శివానీగా గుర్తించిన పోలీసులు.. ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


