Saturday, October 12, 2024
Homeనేరాలు-ఘోరాలుJadcharla: అల్లుకున్న ప్రమాదం

Jadcharla: అల్లుకున్న ప్రమాదం

విద్యుత్ సప్లైలో ఇబ్బందులు..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో శ్రీ పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ తోపాటు స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ ఫార్మర్ కు, అక్కడే ఉన్న స్తంభం పైకి పిచ్చి మొక్కలు ఎగబాకి అసలు ఏ మాత్రం కనిపించకుండా ఉంది.

- Advertisement -

అల్లుకున్న తీగ వల్ల తరచూ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీంతో కాలనీవాసుల విద్యుత్ మీటర్లు కాలిపోయిన సంఘటనలు జరిగాయని వాపోతున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ కు, స్తంభానికి ప్రమాదకరంగా అల్లుకున్న తీగలను, చెట్లను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News