Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుJagityala: కిరాణా షాపులో గంజాయి!

Jagityala: కిరాణా షాపులో గంజాయి!

వ్యాపారి అరెస్ట్

జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం కొండాపూర్ శివారు ప్రాంతంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన మేకల శేఖర్ (35) అనే యువకుడ్ని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం అతని వద్ద నుండి 565, గ్రాముల గంజాయి,సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

నిందితుడు శేఖర్ (35) నిజామాబాద్ జిల్లా కమ్మరిపెల్లి మండలం కొనాపూర్ లో కిరాణం షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన ఎస్సై శ్యామరాజును సిబ్బందిని డిఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు. ఈ సమావేశంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News