Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుNeerja Modi School Amaira suicide : స్కూల్లో లైంగిక వేధింపులు! బిల్డింగ్ పై నుంచి...

Neerja Modi School Amaira suicide : స్కూల్లో లైంగిక వేధింపులు! బిల్డింగ్ పై నుంచి దూకి 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య

Rajastan School Student Amaira suicide : రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రతిష్టాత్మక స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల బాలిక స్కూల్లో వేధింపులు తట్టుకోలేక అక్కడిక్కడే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పాప మేడ పై నుంచి దూకిన సీసీ కెమెరా వీడియోలు వైరల్ గా మారటంతో ఈ ఘటన తల్లిదండ్రులతో పాటు యావత్ దేశాన్ని కలిచివేస్తోంది.

- Advertisement -

రాజస్థాన్‌లో నీర్జా మోడీ స్కూల్‌లో చదువుతున్న 9 ఏళ్ల అమైరా ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులు, సమాజం మొత్తాన్ని కలవరపరిచింది. నవంబర్ 1న ఈ పాప 4వ అంతస్తు నుంచి దూకి మరణించింది. తమ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంటుందని, ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ స్కూల్‌లో వేధింపులు, అవమానాలు పాప మనసును బాధపెట్టాయని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమైరా 4వ తరగతి విద్యార్థిని. ఆ రోజు స్కూల్‌కు వెళ్లనని తల్లికి చెప్పినప్పటికీ తల్లి నచ్చచెప్పి పంపించింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఆమె రెండుసార్లు టీచర్ దగ్గరకు వెళ్లి వచ్చింది. కానీ ఏమి మాట్లాడుకున్నారో తెలియలేదు. తరగతి గది కెమెరాల్లో ఆడియో లేకపోవడం మరో సందేహాస్పదంగా మారింది. సీబీఎస్‌ఇ నిబంధనల ప్రకారం ఆడియో తప్పనిసరి కానీ, స్కూల్ యాజమాన్యం ఈ రూల్ పాటించలేదు.

అమైరా తల్లి శివాని మీడియాతో మాట్లాడుతూ, “ఏడాది నుంచి పాప బాధపడుతోంది. స్కూల్‌లో మగపిల్లలు లైంగిక అర్థాలు వచ్చే చెడు మాటలతో హింసించారు. ఏడిపించారు. అందుకే పాప మానసికంగా కుంగిపోయింది” అని తెలిపారు. తండ్రి కూడా, “తమకు ఈ విషయం తెలిసినప్పుడు అమైరా మాటలు రికార్డ్ చేసి టీచర్‌కు పంపాము. కానీ వారు పట్టించుకోలేదు. పిల్లలతో కలిసి చదువుకోవాలని చెప్పారు తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అమైరా మామయ్య సాహిల్ స్కూల్ యాజమాన్యంపై తీవ్రంగా విరుచుకున్నాడు. “స్కూల్‌లో 5 వేల మంది పిల్లలు ఉన్నా, టెర్రస్‌లకు గ్రిల్స్ లేదా నెట్లు లేవు. అదనపు అంతస్తులు నిర్మించారు, పర్మిషన్ ఎలా వచ్చింది? ఓపెన్ ఫ్లోర్లు ఉంచి పిల్లల భద్రతను ఎలా కాపాడతారు?” అని ప్రశ్నించాడు. ఈ స్కూలు జైపూర్‌లో చాలా పేరుగాంచినది. అయితే ఫీజులు భారీగా వసూలు చేస్తారు కానీ, సేఫ్టీపై శ్రద్ధ లేదని కుటుంబం ఆరోపిస్తోంది. స్కూల్ వర్గాలు మాత్రం, “చెడు మాటల విషయం మాకు తెలియలేదు. వేధింపులు జరగలేవు” అని తిరస్కరిస్తున్నాయి.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్కూల్ రికార్డులు సేకరిస్తున్నారు. రాజస్థాన్ విద్యా శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా స్కూల్స్‌లో వేధింపులు, భద్రతా లోపాలపై చర్చను రేకెత్తించింది. ఇలాంటి దుర్ఘటనలు పిల్లల మానసిక స్వబావంపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad