Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుJanagama Gangrape Case: బాలికపై సామూహిక అత్యాచారం.. 10 మంది యువకుల అరెస్టు!

Janagama Gangrape Case: బాలికపై సామూహిక అత్యాచారం.. 10 మంది యువకుల అరెస్టు!

Janagama Gangrape Case: జనగామ టౌన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

జనగామ జిల్లాలో స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి కుమారుడు ఓ బాలికతో పరిచయం పెంచుకొని, మాయమాటలతో నమ్మించాడు. తన స్నేహితులతో కలిసి జులైలో ఆమెను గోవాకు తీసుకెళ్లి, అక్కడ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తిరిగి జనగామకు తీసుకొచ్చాడు. అయితే కొన్ని రోజులకే ఈ యువకుల మధ్య గొడవ జరగడంతో, అందులో కొందరు ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ విషయం వైరల్ కావడంతో పోలీసులు బాలికను విచారించగా, ఆమె అత్యాచార విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బాలికకు తల్లిదండ్రులు లేనట్లు తెలుస్తోంది.

ALSO READ : Holidays for students: ఈ వారంలో 3 రోజుల సెలవులు: ఎగిరి గంతేస్తున్న విద్యార్థులు..!

ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 2వ తేదీన పదిమంది యువకులను అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇక ఇప్పటికే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో.. సమాజంలో యువత తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటనలకు ఎందరో యవతులు బలైపోతున్నారు. ఈ విషయంపై తగిన చర్యలు సైతం తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad