Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCrime : మహిళను హత్య చేసి ఏడు ముక్కలుగా నరికి బావిలో పడేసి.. ఆపై!

Crime : మహిళను హత్య చేసి ఏడు ముక్కలుగా నరికి బావిలో పడేసి.. ఆపై!

Crime : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కిశోర్‌పురా గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఓ మహిళను హత్య చేసి, ఆమె శరీరాన్ని ఏడు ముక్కలుగా నరికి బావిలో పడేసిన ఘటన స్థానికులను హడలెత్తించింది. ఆగస్టు 13న బావిలో రెండు బస్తాల్లో శరీర భాగాలు తేలుతున్నట్లు స్థానిక రైతు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతురాలి తల, కాళ్లు లభ్యం కాకపోవడంతో గుర్తింపు కష్టమైంది.

- Advertisement -

ALSO READ: Sharmila : వైసీపీ కాషాయ రంగు బయటపడింది – షర్మిల ఘాటు విమర్శలు!

పోలీసులు ఎనిమిది బృందాలతో దర్యాప్తు చేపట్టి, 100 మంది గ్రామస్తులను విచారించి, 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అంటించిన పోస్టర్ల ఆధారంగా మృతురాలి సోదరుడు ఆమెను మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌కు చెందిన రచనా యాదవ్‌గా గుర్తించాడు. రచనా భర్త మరణించిన తర్వాత, గ్రామ మాజీ ప్రధాన్ సంజయ్ పటేల్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రచనా వివాహం కోసం ఒత్తిడి చేయడంతో సంజయ్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు.

సంజయ్, తన మేనల్లుడు సందీప్ పటేల్, స్నేహితుడు ప్రదీప్ అహిర్వార్‌లతో కలిసి ఆగస్టు 9-10 మధ్య రచనాను కారులో గొంతు కోసి హత్య చేశాడు. శరీరాన్ని ఏడు ముక్కలుగా నరికి, మూడు బస్తాల్లో కుక్కి, బావిలో పడేశారు. తల, కాళ్లను లఖేరి నదిలో విసిరారు. పోలీసులు సంజయ్, సందీప్‌లను అరెస్టు చేశారు. ప్రదీప్ పరారీలో ఉండగా, ఆగస్టు 21న ఎన్‌కౌంటర్‌లో అతడు గాయపడి పట్టుబడ్డాడు. పోలీసులు రచనా తలను నది నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad