Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుRobbery in Kadthal: హైదరాబాద్ కు అతి సమీపంలో దారి దోపిడి!

Robbery in Kadthal: హైదరాబాద్ కు అతి సమీపంలో దారి దోపిడి!

కడ్తాల్- తలకొండపల్లి మార్గ మధ్యలో..

వెంకట్రావు పెట్ గ్రామానికి చెందిన బోదాస్ శ్రీకాంత్ 24 సంవత్సరాలు. బైక్ మెకానిక్ కడ్తాల్ లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా పని ముగించుకొని ఊరికి వెళ్తుండగా సలార్పూర్ గేటు దాటిన తర్వాత అడవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని అడ్డగించారు. సుమారు 8 మంది కలిసి గుంపుగా వచ్చి..రోడ్డుకు తాడు అడ్డంపెట్టి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. వీరిలో కొందరు బాధితుని చేతులు బంధించారు, మిగతా వాళ్ళు బలవంతంగా అతని దగ్గర ఉన్న డబ్బులు గుంచుకున్నారు. వాళ్ళను తప్పించుకున్న ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి చాకు తీసుకొని అతని గాయపరిచాడు. అతని దగ్గర ఉన్న వెండి చైన్ కూడా గుంజుకున్నారు. సెల్ఫోన్ కూడా తీసుకుని వెళ్ళారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad