Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ఏసీబీ కేసులో ఇంజనీర్ కు జైలు

Karimnagar: ఏసీబీ కేసులో ఇంజనీర్ కు జైలు

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి..

రైతుల భూములకు విద్యుత్ సరఫరా ఎస్టిమేట్స్ స్క్రూటినీ పైఅధికారులకు పంపడానికి 15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన రేగుంట స్వామి (34) అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు అదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలంలొని సిరిచెలిమ గ్రామానికి చెందిన గుండాల కనకయ్య తన తల్లి గుండాల ఎల్లమ్మ పేరున ఒక్క ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి ఉన్న విద్యుత్ సరఫరా లేదు. వ్యవసాయ భూములకు ప్రభుత్వం తాత్కాల్ పథకం ద్వారా రూ.6125 ప్రభుత్వానికి చెల్లిస్తే రైతు భూములకు విద్యుత్ సరఫరా చేస్తారని తెలిసి, ఇచ్చోడ గ్రామంలోని ఏఏఈని కలువగా బ్యాంకులో డిడి కట్టలని చెప్పాగా, బ్యాంకులో డబ్బులు కట్టి ఇవ్వగా, ఎస్టిమేట్ తయారుచేసి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కు పంపినమని తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రెగుంట స్వామీ ని కార్యాలయంలో కలువగ 30000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా, అంత శక్తి మాకు లేదని 15 వేలకు ఒప్పందం చేసుకొని డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. సాక్షాధారాలు పరిశీలించిన అనంతరం రేగుంట స్వామిపై నేరం నిరూపణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 30 వేల రూపాయలు జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News