Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: భార్య పుస్తెలమ్మి అప్పు కడుతున్నానని సర్పంచ్ నిరసన

Karimnagar: భార్య పుస్తెలమ్మి అప్పు కడుతున్నానని సర్పంచ్ నిరసన

నా బిల్లులు ఇవ్వకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తా

బిల్లులు రానందుకు తాను ఇక్కడికిక్కడే పురుగుల మందు తాగి ఛస్తానంటూ ఓ గ్రామ సర్పంచ్ నిరసనకు దిగిన ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. పందికుంటపల్లి గ్రామ సర్పంచ్ మొగుళ్ల ఎల్లయ్య తను కట్టిన స్మశాన వాటిక గ్రావెల్ బిల్లు వివిధ రకాల పనులు చేసిన వాటికి ఇప్పటివరకు నాలుగు సంవత్సరాల నుండి బిల్లులు రావడం లేదని గ్రామ పంచాయతీకి ఇచ్చిన డిజిటల్ కి కూడా వారే దగ్గర ఉంచుకొని నాకు తెలియకుండా ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు విడ్రా చేస్తున్నారని నాపై అధికారులు అనధికారులు బిల్లులు ఇవ్వకుండా కక్ష కడుతున్నారని కన్నీరు మున్నీరవుతూ అధికారుల కాళ్లు మొక్కుతూ పోడియం వద్ద బైఠయించారు. నా భార్య పైన ఉన్న బంగారం పుస్తెలతాడుతో సహా అమ్మానని ఇప్పటికైనా నా బిల్లులు ఇవ్వకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తానని అధికారులను వేడుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో జనరల్ బాడీలలో నా సమస్యను వెలువెత్తిన ఇప్పటి వరకు పరిష్కరిస్తాలేరని అన్నారు. ఈ విషయంపై ఎంపీపీ కలిగేటి కవిత మాట్లాడుతూ అధికారులు వెంటనే సర్పంచ్ బిల్లులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కరరావు, తాసిల్దార్ భాస్కర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాండ అజయ్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

కరీంనగర్ జిల్లా రామడుగు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ అధికారులు నివేదికలు చదివి వినిపించగా గుండి ఎంపిటిసి అంగన్వాడి సెంటర్ కూలిపోయే ప్రమాదంలో ఉన్నదని దానిని మార్చాలని అధికారులను కోరారు. రామడుగు ప్రధానోపాధ్యాయురాలు రామడుగు ఉన్నత పాఠశాల చాలా బాగా ఉన్నదని అందులో విద్యార్థులు మాత్రం తక్కువ ఉన్నారని అందరం కలిసి విద్యార్థులను పాఠశాలలో చేర్పించే దానికి కృషి చేయాలని కోరారు. రామడుగు తాసిల్దార్ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒకరు కేవైసీ చేసుకోవాలని రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి కేవైసీ చేసుకోకపోతే కార్డు ద్వారా లబ్ధ చేకూరదని అన్నారు. గుండి పీహెచ్సీలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News