Man Kills Daughter, Dies By Suicide After Wife Elopes With Lover: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. తన భార్య వేరే వ్యక్తితో పారిపోవడంతో మనస్తాపం చెందిన 37 ఏళ్ల వ్యక్తి, తన నాలుగేళ్ల కూతురిని చంపేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన మంగళవారం రాత్రి జిల్లాలోని ములబాగల్ తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోకేష్ (37), అతని భార్య నవ్యశ్రీకి పెళ్లై నాలుగేళ్లయింది.
ALSO READ: Crime: భయంకరమైన దృశ్యం.. భర్తను చంపి.. శవం పక్కనే మేకప్ వేసుకున్న భార్య!
బిడ్డ చివరి కోరిక తీర్చి.. కారులోనే హతమార్చి
ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు, నవ్యశ్రీ తన భర్త లోకేష్ కోసం ఒక లేఖ రాసిపెట్టింది. ఆ లేఖలో, తాను ఇకపై అతనితో ఉండదలుచుకోలేదని, విడాకులు కావాలని కోరుకుంటూ, తన కోసం వెతకవద్దని కోరింది.
మంగళవారం రోజున లోకేష్ తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత లోకేష్ తన కూతురు నిహారికను తీసుకుని కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, లోకేష్ ముందుగా నిహారికను బేకరీకి తీసుకెళ్లి, ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని కొని తినిపించాడు. ఆ తర్వాత, కారులోనే ఆమెను ఉరివేసి చంపేసి, అనంతరం తాను సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ: Insurance Fraud: భర్త చనిపోయాడంటూ రూ. 25 లక్షల ఇన్సురెన్స్ డబ్బు పొందిన మహిళ.. ఎలా బుక్కైందంటే..
బుధవారం రోజున, నిహారిక మృతదేహం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో లభ్యం కాగా, లోకేష్ మృతదేహం సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది.
వివాహేతర సంబంధమే కారణం
ప్రాథమిక విచారణలో, లోకేష్ భార్య మరొక వ్యక్తితో సంబంధంలో ఉందని, అతనికి విడాకులు ఇవ్వాలని కోరుకుందని పోలీసులు గుర్తించారు. లోకేష్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Couple Found Dead: లోపల గడియ పెట్టి ఉన్న ఇంట్లో దంపతుల మృతదేహాలు లభ్యం.. పెళ్లై ఏడాది కాకముందే..


