ముదిరాజులను అవమానించాడని పేర్కొంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ లోని కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీఫై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదును ముదిరాజ్ సంఘం నేతలు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజులని అవమానించేలాగా మాట్లాడడమే కాకుండా ముదిరాజ్ కులస్తుడైన జర్నలిస్టుపై దాడి చేయడానికి తప్పు పట్టారు. ఇది బహుజనులను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుర నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నెల్లి శంకర్, ఉపాధ్యక్షులు నాయిని రవి, ప్రధానకార్యదర్శి పశువుల రామకృష్ణ, గంట నారాయణ స్వామి, జాయింట్ సెక్రెటరీ మాదాసు రాజు, సంఘం సీనియర్ నాయకులు చవ్వ వెంకటేష్, వనపర్తి రవీందర్,చామకూర శ్రీనివాస్, పశువుల పవన్, నర్సింగరావు ఆడవాల నరేందర్, సీనియర్ నాయకులు కోట్ల శ్రీనివాస్, బోరబండ ముదిరాజ్ సంఘం జనరల్ సెక్రెటరీ కొత్త వెంకటేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కౌశిక్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES