Monday, December 4, 2023
Homeనేరాలు-ఘోరాలుKavali: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో అరెస్టులు

Kavali: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో అరెస్టులు

నిందితుల్లో కొందరు ఇంకా మిస్సింగ్

ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన ముద్దాయిలను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. కావలి పరిధిలో RTC డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో ఏడుగురు ముద్దాయిలు అరెస్ట్.. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యస్.పి. హెచ్చరించారు.

- Advertisement -

నేరం జరిగిన వెంటనే యస్.పి. ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం జల్లెడ పట్టారు నెల్లూరు పోలీసులు. మాయపూరిత మాటలు, బెదిరింపులకు పాల్పడి ప్రజలను మోసం చేయడమే వీరి నైజం. ముద్దాయిలపై గతంలోనూ పలు కేసులలో నిందితులుగా మరియు సస్పెక్ట్ షీట్ లున్నాయి.

సాంకేతికత ఆధారంగా క్షుణంగా శోధించి 24 గంటలలోపు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు:- 1) బండి విల్సన్ తండ్రి సుధాకర్ 2) ఇతను 14 కేసులలో వివిధ పోలీసు స్టేషన్ల యందు ముద్దాయిగా వున్న పుట్టా శివకుమార్ రెడ్డి ఆ మహేంద్ర రెడ్డి తండ్రి మధుసూధన్ రెడ్డి, 24 yrs, ఇందిరానగర్, కావలి, No అల్లూరు పేట, అల్లూరు మండలం. వీరు 08 కేసులనందు వివిధ పోలీసు స్టేషన యందు ముద్దాయిగానూ మరియు కావలి టౌన్ నందు Suspect sheet కలదు. 3) షేక్ ఖాజావలి ఆ మల్లి తండ్రి మస్తాన్, 33 yrs. n/o గుడిపాడు గ్రామము, A.S. పేట మండలం, r/o న్యూ శివాలయం, తుఫాన్ నగర్, కావలి టౌన్. కుప్పాల వంశీ /o రాంబాబు, 18 yrs, కులం కృష్ణ బలిజ 7/o Near ASR కళ్యాణమండపం, ఇందిరా నగర్, కావలి టౌన్.

5) షేక్ కలీమ్ చోటు తండ్రి ఫైయాజ్ 6) షేక్ ఇలియాజర్ తండ్రి జిలాని, వయస్సు 35 సం.లు

7) షేక్ బాజీ తండ్రి ఖాజావలి, 31 yrs

మిగిలిన ముద్దాయుల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ ఆటోనగర్ డిపోకు, చెందిన సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లుగా డ్యూటీలో వుండి బెంగుళూరు నుండి విజయవాడకు వెళ్తుండగా సాయంత్రం 5 గంటల సమయంలో కావలి పట్టణంలోని చేపల మార్కెట్ వద్ద RTC బస్సుకు ముందు ఆగి వున్న కారును చూచి డ్రైవరు రామ్ సింగ్ హారన్ కొట్టగా కారులోని నలుగురు వ్యక్తులు దిగివచ్చి ఫిర్యాదితో గొడవ పెట్టుకొని ముందర వాహనాలు వుంటే ఊరికే హారన్ కొడతావా అని రామ్ సింగ్ ను చేత్తో కొట్టారని, అక్కడ కొందరు సర్దుబాటు చేయగా, తిరిగి ఫిర్యాది వారి బస్సును విజయవాడ వైపునకు వెళుతుండగా నేషనల్ హైవే- 16 ప్రక్కన మద్దురుపాడు సర్వీసు రోడ్డులో AMC మార్కెట్ యార్డ్ దాటిన తరువాత సాయంత్రం 6 గంటలకు పై తెలిపిన ముద్దాయిలు రెండు కార్లలో వచ్చి ఫిర్యాది బస్సును అడ్డగించి ఫిర్యాది విధులకు ఆటకంపరుస్తూ బస్సులో నుండి పిర్యాదిని క్రిందకు లాగి పడవేసి చంపాలనే ఉద్దేశ్యంతో కడపు, గొంతు మీద, కాళ్ళతో తోక్కి, చేతులతో విచక్షణారహితముగా కొడుతూ అడ్డు వచ్చిన సహ డ్రైవర్ శ్రీనివాసరావును కూడా కాళ్ళు చేతులతో కొట్టుతుండగా, బస్సులోని ప్రయాణికులు సెల్ నందు వీడియో తీస్తుండగా, సదరు సెల్ ఫోన్ ను నేలకు కొట్టి ధ్వంసము చేసినారు, ముద్దాయిలు కొట్టిన దెబ్బలకు ఫిర్యాది స్పృహ తప్పి రోడ్ పై పడిపోగా, ఫిర్యాదు మేరకు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడమైనది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News