Sunday, April 13, 2025
Homeనేరాలు-ఘోరాలుKodimyala: వాగులో చిక్కుకున్న బస్సు

Kodimyala: వాగులో చిక్కుకున్న బస్సు

తప్పిన ప్రమాదం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట ఊరు చివరలో వాగు రాత్రి కురిసిన వర్షానికి నీరు ప్రవహిస్తుంది. కోరుట్ల నుండి కొడిమ్యాల మీదుగా కరీంనగర్ వెళ్లే బస్సు ఒక్కసారిగా ఆ వాగులో ఇరుక్కుంది. దీంతో ప్రయాణికులు భయ ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంత ప్రయత్నించిన బస్సు బయటకు రాకపోయేసరికి ప్రయాణికులు బస్సు దిగి నడిచి, వాగును దాటినారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చేయడం లేదని, ఇకనైన బ్రిడ్జ్ నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News