Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుKolcharam: దేవాలయంలో దొంగలు అయినా పట్టించుకోని ఖాకీలు

Kolcharam: దేవాలయంలో దొంగలు అయినా పట్టించుకోని ఖాకీలు

నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు హుండీ పగలగొట్టిన దుండగులు

యనగండ్ల గ్రామపంచాయతీ పరిధి లోని దుంపలకుంట చౌరస్తా సమీపంలో గ్రామానికి చెందిన గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో వ్యవధిలో గుర్తు తెలియని దుండగులు మూడుసార్లు పడ్డారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి సోమవారం రాత్రి ఎల్లమ్మ దేవాలయంలో చోరి జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీతోపాటు సామాగ్రి గది తాళాలు పగలగొట్టారు అందులో ఉన్న సీసీ కెమెరా సిపియు, సౌండ్ సిస్టంతో పాటు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

- Advertisement -

దుండగులు గర్భగుడి తాళాలుసైతం పగలగొట్టి ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. వరుస దొంగతనాలపై ఫిర్యాదు చేసినా పోలీసులకు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేయటం లేదని దీంతోనే తడుచు దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేయడంతో పాటు ఎల్లమ్మ దేవాలయంలో చోరీ పాల్పడిన వ్యక్తులను వెంటనే పట్టుకుని సొమ్ములు ,వస్తువులు రికవరీ చేయాలి ఎనగండ్ల దుంపలకుంట గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News