కోనరావుపేటలో కుల బహిష్కరణ ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని కోనరావుపేట ఎస్.ఐ ఎన్. రమాకాంత్ తెలిపారు. రాజన్న సిరిసిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో ఒక కుటుంబాన్ని అదే కులానికి చెందిన వారు కుల బహిష్కరణ చేశారు. ఆ కుటుంబానికి జరిమానా విధించి, వారితో మాట్లాడకుండా, పండుగలకు, ఇతర కార్యక్రమాలకు పాల్గొనకుండా తీర్మానం చేశారని బాధిత కుటుంబం కోనరావుపేట ఎస్.ఐ కి పిర్యాదు చేయడంతో సంఘ విద్రోహ ఘటనకు కారణమైన వ్యక్తులపై బుధవారం కేసు నమోదు చేశామని అన్నారు. సమాజంలో మనుషులు అందరూ సమానం అని ఇలా కులాల నిర్బంధంతో కొన్ని కుటుంబాలను చిత్రహింసలు చేయడం సరికాదని, మండలంలో ఇలాంటి ఘటనలు జరిగినా కొందరు భయపడి వారిని ఎదిరించలేని వారు ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Konaraopeta: కుల బహిష్కరణ చేసిన వారిపై కేసు
కఠిన చర్యలు తప్పవంటూ పోలీసుల హెచ్చరికలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES