Thursday, April 10, 2025
Homeనేరాలు-ఘోరాలుLakshmirajam brutally killed: లక్ష్మీరాజం బంధువుల ధర్నా

Lakshmirajam brutally killed: లక్ష్మీరాజం బంధువుల ధర్నా

ఇంత దారుణమా అంటూ ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజంను చంపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై శవంతో సుమారు అరగంట పాటు ధర్నా నిర్వహించారు. నచ్చచెప్పాలని చూసిన పోలీసులతో వాగ్వివదానికి దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇంత దారుణమా అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చంపడం ఏంటని సాగర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై కిరణ్ కుమార్ దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

- Advertisement -

పోగుల లక్ష్మీరాజం మరణం పట్ల కేటీఆర్ సంతాపం

కోరుట్ల పట్టణంలోని కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త పోగు లక్ష్మీరాజ్యం మరణం పట్ల మున్సిపల్ శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంతాపం తెలిపారు. సామజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్ డా. కల్వకుంట్ల సంజయ్ కి ఫోన్ చేసి, హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఉమారాణికి పార్టీ అండగా ఉంటుందని దైర్యంగా ఉండాలని కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News