Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKorutla: కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజo హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్టు

Korutla: కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజo హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్టు

సిబ్బందిని అభినందించిన జగిత్యాల ఎస్పీ భాస్కర్

కోరుట్ల కోరుట్ల పట్టణంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త పోగుల లక్ష్మీరాజం హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు జగిత్యాల జిల్లా ఎగ్గడి భాస్కర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలో తేదీ 8- 8- 2023, న సుమారు 9 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే కోరుట్ల పట్టణ కార్గిల్ చౌరస్తాకి ఎదురుగా ఉన్న శంకర్ టీ స్టాల్ లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్కు ధరించి టీ తాగడానికి వచ్చిన కౌన్సిలర్ ఉమారాణి భర్త లక్ష్మీరాజంపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి మోటార్ సైకిల్ పై పారిపోయారు. గాయాల పాలైన లక్ష్మీరాజంను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అదే రోజు సుమారు 11, గంటలకు చనిపోయాడు మృతుని భార్య భార్య పోగుల ఉమారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు పిల్లి సత్యనారాయణ కాసుల వంశీ అను నలుగురు వ్యక్తులపై కోరుట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు అట్టి కేసును చేదించడానికి జగిత్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎగ్గడి భాస్కర్ ఆదేశానుసారం మెట్పల్లి డివిజన్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లు ఏడు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో విత్తనాల నాగరాజు విశాల్ వంశీ మధు దీపక్ అలియాs సిద్ధులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేయడానికి గల కారణాలు హత్యకు వాడిన ఆయుధాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -

విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి పిల్లి సత్యనారాయణ వంశీ విశాల్ మదన్మోహన్ దీపక్ అలియాస్ సిద్దు ప్రభాస్ లు మొత్తం ఎనిమిది మంది కలిసి భూదందా ల్యాండ్ సెటిల్మెంట్లలో ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భయం కలిగించి ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాలని నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగా పట్టణంలో పేరు ఉన్న ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగా రోడ్డు మీద చంపినట్లైతే ప్రజలలో నాగరాజు తన అనుచరులంటే భయం కలుగుతుందని ఆ తర్వాత కోరుట్ల పట్టణంలో ఏ సెటిల్మెంట్ అయినా తామే చేయవచ్చని అందుకు లక్ష్మీరాజం సరైన వ్యక్తిగా ఎంచుకొని గత నెల 30వ తేదీ రోజున వంశీ వాళ్ళ ఇంటి మీద దావత్ చేసుకొని ఏ విధంగా చేయాలని పథకం రచించారు.

వారి పథకంలో భాగంగా నరసింహ అనే వ్యక్తి లక్ష్మీరాజం కదలికలను గమనిస్తూ నాగరాజుకు చేరేది వేయవలసినదిగా సరైన సమయం స్థలం చూసి నాగరాజుకు చెప్పినట్లయితే నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు లక్ష్మీరాజంను చంపితే అట్టి హత్య పిల్లి సత్యనారాయణ త్రిమూర్తులు తామే చేసినట్లుగా పోలీసులకు లొంగిపోవాలని అందుకు నాగరాజు వారికి లక్ష రూపాయలు కొంత భూమిని ఇచ్చే విధంగా ఒప్పుకున్నాడు అందుకు సహకరించిన మిగిలిన వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు తమ పథకంలో భాగంగా తేదీ 8, 8, 2023, రోజున ఉదయం 9, గంటలకు శంకర్ హోటలకు టీ తాగడానికి వచ్చిన లక్ష్మీరాజంను గమనించిన నరసింహ వాట్సాప్ కాల్ ద్వారా నాగరాజుకు తెలియజేయగా నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి ఒకే బైక్ పై వచ్చి నాగరాజు కత్తితో దాడి చేస్తుండగా అతని తమ్ముడు అతనిని తీసుకుపోవడానికి మోటార్ సైకిల్ తో రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో విశాల్ పిల్లి సత్యనారాయణ ఒకవైపు ఒక బైక్ పైన వంశీ అతని తమ్ముడు మదన్మోహన్ మరో బైక్ పైన దీపక్ అలియాస్ సిద్దు ప్రభాస్ లు మరో బైక్ పై మూడు వైపులా లక్ష్మీరాజం వారి నుండి పారిపోకుండా చూస్తుండగా నాగరాజు లక్ష్మీరాజంపై కత్తితో దాడి చేసినాడు. వెంటనే అక్కడి నుండి వంశీ వాళ్ళ పొలం దగ్గర 9, మంది కలుసుకొని వారి పథకంలో భాగంగా అక్కడి నుండి పిల్లి సత్యనారాయణ త్రిమూర్తులు కలిసి లక్ష్మీ రాజంను చంపినారని పోలీసు వారికి అనుమానం వచ్చే విధంగా ఉండాలని పల్సర్ బైక్ పై అక్కడ నుండి పారిపోయారు. అనంతరం హత్య చేస్తుండగా అక్కడే ఉండి చూసినవారు నాగరాజును గుర్తుపట్టారని తెలుసుకొని లక్ష్మీ రాజంను చంపడానికి ఉపయోగించిన కత్తులను హత్య రోజు వారు ఉపయోగించిన మోటార్ సైకిల్ లను వంశీ వాళ్ళ పొలం దగ్గర దాచిపెట్టి మిగిలిన వారు కూడా పోలీస్ వారికి దొరకకుండా దాక్కొని శుక్రవారం ఉదయం మరల కోరుట్ల పట్టణ మీదుగా పారిపోతుండగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుని హత్యపై అతని బంధువులు మరికొంత మందిపై అనుమానం వ్యక్తపరుస్తున్నారు.

అనుమానాలకు సంబంధించిన మరికొంతమందిని విచారించిన వలసిన అవసరం ఉన్నదని దానితో పాటు మరికొంత సాంకేతిక సమాచారం సేకరించవలసిన అవసరం ఉంది. సమాచారం సేకరించిన అనంతరం తదుపరి విచారణ కొనసాగించి ఈ కేసులో ఎంతమంది నిందితుల ప్రమేయం ఉన్నదని నిర్ధారించాల్సి ఉంది దానికి గల కారణాలను పూర్తి ఆధారాలతో సహా సేకరించి హత్య చేయడానికి గల సరైన కారణం అందుకు సహకరించిన అందరి నిందితులను పూర్తి వివరాలతో పట్టుకొని విచారించి కోర్టు నందు ప్రవేశపెట్టి తదుపరి విచారణ చేపడతామన్నారు. వీరందరిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. విత్తనాల నాగరాజు 40 విత్తనాల త్రిమూర్తి 38 కాసుల వంశీ 24 పిల్లి సత్యనారాయణ 41 విశాల్ 26 కాసుల మదన్మోహన్ 23 మార్త నరసింహులు 29 శ్రీరాముల దీపక్ 21 మారుప్రాక ప్రభాస్ 18 లను అరెస్టు చేసినట్లు నిందితుల నుండి ఐదు కత్తులు నాలుగు మోటార్ సైకిళ్ళు 8 సెల్ ఫోన్లు ఒక కారును స్వాధీనపరచుకున్నట్లు, ఈ కేసును అతి తక్కువ సమయంలో మెట్పల్లి డివిజన్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో చేదించిన కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరుట్ల కథలాపూర్ మేడిపల్లి మల్లాపూర్ పెగడపల్లి ఎస్ఐలను వారి సిబ్బందిని జగిత్యాల ఎస్పీ భాస్కర్ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News