Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుLakshmipuram: మా గ్రామాన్ని పట్టించుకునే నాధుడు లేడా

Lakshmipuram: మా గ్రామాన్ని పట్టించుకునే నాధుడు లేడా

తాగు నీరు కూడా లేక అల్లాడుతున్న..

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో 40 మంది అతిసారవ్యాధితో హాస్పిటల్ పాలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల నుండి లక్ష్మీపురం ప్రజలు హాస్పిటల్ లో చికిత్సలు పొందుతున్నారని అందులో కొంతమందికి స్ట్రోక్ మాదిరిగా వచ్చి హాస్పిటల్లో ఐసీయులో ఉన్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామంలో డ్రైనేజీ వల్ల అందిట్లో ఇసుక చూడడంతో వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

లక్ష్మీపురం గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు, ఆయనకు నలుగురు అన్నదమ్ములు ఉండగా వారు కూడా హాస్పిటల్ పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన వారు లేక ఆయన విరేచనాలు ఎక్కువ కావడంతో స్ట్రోకు రావడంతో ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి మా గ్రామంలో త్రాగునీరు కలిసిందో కాకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలు తెలియజేశారు.

కార్పొరేటర్ నారాయణరెడ్డిని వివరణ అడగగా డ్రైనేజీ వల్ల అందులో ఇసుక పోయడంతో గ్రామంలోని మరుగుదొడ్ల నీరు ఎక్కడికి పోలేక గ్రామం అంతా దుర్వాసన వెదజల్లుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి, మున్సిపాలిటీ అధికారులకు తెలియజేశామన్నారు. వారు వెంటనే స్పందించి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి, దుర్వాసన రాకుండా ఉండటానికి క్రిమిసంహారక మందులు చల్లారని ఆయన తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News