Law College Rape Case: కోల్‌కతాలోని ఓ లా కాలేజీలో జరిగిన అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు బాధితురాలికి సంబంధించిన అనేక వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని 650 పేజీల చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. మహిళ వైద్య పరీక్షలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాగా, నిందితుడి డీఎన్‌ఏ ఫోరెన్సిక్ నమూనాలతో సరిపోలింది.
ALSO READ: Crime : దారుణం.. అదనపు కట్నం కోసం భార్యను పెట్రోల్ పోసి కాల్చి చంపిన భర్త!
ఏం జరిగిందంటే..
జూన్ 25న సౌత్ కోల్‌కతా లా కాలేజీ ప్రాంగణంలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్ర, సహ నిందితులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురితో పాటు సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని కూడా నిందితుడిగా చేర్చారు.
ALSO READ: Kukatpally murder case: కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు..!
ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా నిందితులు బాధితురాలిని లాక్కెళ్లి బంధించిన సీసీటీవీ ఫుటేజీ, వారి మొబైల్ ఫోన్లలో దొరికిన అశ్లీల వీడియోలు ఉన్నాయని చార్జిషీట్‌లో వివరించారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఉన్న రంధ్రం గుండా ఈ వీడియోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలలో నిందితుల వాయిస్‌లను కూడా గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్ల లొకేషన్ కూడా నేరం జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
సంఘటన జరిగిన సమయంలో పోలీసులకు లేదా సమీపంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డు గదిని లాక్ చేశాడని చార్జిషీట్‌లో ఉంది. గతంలో మనోజిత్ మిశ్రా ఎనిమిది సార్లు అరెస్టు అయినప్పటికీ, అతని స్నేహితులు బెయిల్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Murder in UP: పెళ్లి ఒత్తిడితో దారుణం: ప్రియురాలిని ఏడు ముక్కలుగా నరికిన ప్రియుడు..!


