Monday, December 9, 2024
Homeనేరాలు-ఘోరాలుLaw Student | లా విద్యార్థిని మిస్టరీ డెత్.. గిరిజన సంఘాల ధర్నా

Law Student | లా విద్యార్థిని మిస్టరీ డెత్.. గిరిజన సంఘాల ధర్నా

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో లా విద్యార్థిని (Law Student) సూసైడ్ కేసు చర్చనీయంశంగా మారింది. ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం జరగాలంటూ విద్యార్థిని కుటుంసభ్యులు, గిరిజన సంఘాల నాయకులు ఆందోళనకి దిగారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

ఇస్లావత్ శ్రావ్య అనే 20 ఏళ్ల లా విద్యార్థిని (Law Student) సోమవారం ఉదయం మలక్‌పేటలోని మూసారాంబాగ్‌లో ఆత్మహత్యకి పాల్పడింది. ఆమె పార్ట్ టైమ్ జాబ్ చేస్తోన్న కన్సల్టెన్సీ ఆఫీసులోనే చున్నీతో ఫ్యాన్ కి ఉరేసుకుంది. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : Drunk and Drive | కారుతో మహిళ బీభత్సం

అయితే శ్రావ్యది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, హతమార్చారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకి న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో స్టేషన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి సర్దిజెప్పే ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని, ఆరోపణలు నిజమైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రావ్య కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News