పోలీసుల వివరాల ప్రకారం, మృతుడిని అలీ అబ్బాస్ (26)గా గుర్తించారు. నిందితులు హిమాలయ ప్రజాపతి, సోను, సౌరభ్ ప్రజాపతి తమ సోదరితో అలీ అబ్బాస్ ప్రేమ వ్యవహారంపై మాట్లాడాలనే నెపంతో అతడిని తమ ఇంటికి పిలిచారు. అనంతరం కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో అలీ అబ్బాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ALSO READ: Girl Dies At School: పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని మృతి.. ‘న్యాయం’ కోసం తల్లి ఆవేదన
దాడి జరిగినట్లు రాత్రి 1 గంట ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అలీ అబ్బాస్‌ను అపస్మారక స్థితిలో గుర్తించారు. వెంటనే అతడిని ట్రామా సెంటర్‌కు తరలించగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Infanticide: మనుమడు పుట్టలేదని కక్ష.. 4 నెలల మనవరాలిని చంపి బావిలో పడేసిన నానమ్మ
అలీ అబ్బాస్ తండ్రి ఆరిఫ్ జమీర్ ఫిర్యాదు మేరకు సాదత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకు కారణం అలీ అబ్బాస్ తమ సోదరితో ప్రేమ వ్యవహారం పెట్టుకోవడమేనని నిందితులు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం హిమాలయ ప్రజాపతి, సౌరభ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సోను పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం నివేదిక కోసం మృతదేహాన్ని పంపినట్లు, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Impotency case: ‘నీకు లైంగిక సామర్థ్యం లేదు.. రూ.2 కోట్లు ఇవ్వు’.. అంటూ వేధించిన భార్యపై భర్త కేసు


