Monday, June 24, 2024
Homeనేరాలు-ఘోరాలుMadnuru: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Madnuru: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

మిన్నంటిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియలేదు. మద్నూర్ పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేస్తున్నారు. కాగా ఈ గురుకుల పాఠశాలలో గత సంవత్సరంలో కూడా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా, ఇది రెండవ ఆత్మహత్యగా కలకలం సృష్టిస్తోంది. ఈ విషయమై గురుకుల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా విద్యార్థి వచ్చిన రెండవ రోజుకే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని తెలియజేశారు. ఆమె మృతి గల కారణాలు తనకు కూడా తెలియవని తెలియజేశారు. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు తమకు న్యాయం జరగాలని ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News