అది ఇటలీలో మోస్ట్ పవర్ఫుల్ మాఫియా గ్యాంగ్ గా ఉంది. దీని బాస్ మాత్రం ఎక్కడున్నాడో , ఎలా ఉంటాడో ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు సాధారణ జనం మాత్రం ఆయన చేత్తో తయారైన పిజ్జాలు తింటూ లొట్టలేస్తున్నారు. అంటే ఇటలీ మాఫియా డాన్ ఫ్రాన్స్ లో పిజ్జాలు చేస్తున్నారన్నమాట. అనుకోకుండా ఇటాలియన్ మాఫియా డాన్ పిజ్జా చెఫ్ గా ఫ్రాన్స్ లో అజ్ఞాత వాసం చేయటం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇటలీ మాఫియా ముఠాకు డాన్ అయిన ఎడ్గర్డో గ్రెకో ఇద్దరు వ్యక్తుల హత్యా నేరంలో శిక్షనుంచి తప్పించుకునేందుకు ఫ్రాన్స్ కు మకాం మార్చాడు. 63 ఏళ్ల ఈ డాన్ 16 ఏళ్లుగా శిక్షను తప్పించుకునేందుకు పిజ్జా రెస్టారెంట్ లో పిజ్జా మాస్టర్ గా సెటిల్ అయిపోయాడు. ఇంటర్ పోల్ ఈ కరుడుగట్టిన నేరస్థుడిని ఎట్టకేలకు గుర్తించి, అరెస్ట్ చేయటంతో ఇప్పుడు ఈ డాన్ పేరు ప్రపంచంలో మారుమోగుతోంది. మాఫియా వార్ లో భాగంగా ఆ హత్యలు చేసినట్టు ఇప్పుడు ఈయన అంగీకరించాడు కూడా. డ్రంగ్టా అనే అండర్ వల్డ్ మాఫియా ముఠాకు గ్రెకో బాస్. వీరు ప్రపంచంలో కొకైనా ట్రాఫికింగ్ కు పెట్టింది పేరు. యూరోపియన్ దేశాల్లో వీళ్ల చీకటి వ్యాపారాలు అన్నీ మోనోపలీగా ఉంటున్నాయి. అయితే.. ఫేస్ బుక్ లో ఫ్రాన్స్ కు చెందిన పిజ్జా రెస్టారెంట్, మెనూ, చెఫ్ గురించిన మ్యాగజైన స్టోరీలు చదివిన ఇంటర్ పోల్ నేరస్థుడిని గుర్తించటంతో కథ సుఖాంతమైంది.