Man Kills Minor Fiancée After Fight: పెళ్లి చేసుకోవాల్సిన ప్రియురాలిని ప్రియుడు మద్యం మత్తులో హతమార్చి పారిపోయిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ దారుణం పాల్ఘర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, బుధవారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ALSO READ: Intercaste Relationship: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ
ఏం జరిగింది?
జవ్వార్ ప్రాంతంలోని బివాల్ధర్ గ్రామంలో ఒక 17 ఏళ్ల అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడితో నిశ్చితార్థం జరిగింది. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నిందితుడు తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. మంగళవారం అమ్మాయి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. అదే సమయంలో నిందితుడు అమ్మాయి ఇంటికి వచ్చాడు. వారిద్దరి మధ్య ఏదో విషయంపై చర్చ ప్రారంభమై, అది కాస్తా గొడవగా మారింది.
ALSO READ: Kanpur murder: స్నేహానికి ఘోరమైన వెన్నుపోటు.. చెల్లితో ప్రేమ వ్యవహారమని.. తల నరికి ముక్కలు చేసి!
గొడవ కాస్తా హత్యకు దారితీసింది
మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. కోపోద్రిక్తుడైన నిందితుడు అమ్మాయిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణం తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. చుట్టుపక్కల వారు కూడా ఈ ఘటన గురించి తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ALSO READ: Man Kills Wife: భార్య రీల్స్ చేస్తోందని.. గొంతు నులిమి చంపిన భర్త
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 103(1) (హత్య) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: Gang rape: మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్, వీడియో రికార్డ్: ఏడుగురి అరెస్ట్..!


