Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుMan Blackmailed By Lover: 21 ఏళ్ల యువతితో అఫైర్.. ఆమె బ్లాక్‌మెయిల్‌కి వ్యాపారవేత్త సూసైడ్?

Man Blackmailed By Lover: 21 ఏళ్ల యువతితో అఫైర్.. ఆమె బ్లాక్‌మెయిల్‌కి వ్యాపారవేత్త సూసైడ్?

Man Blackmailed By Lover, Found Dead: పెళ్ళైన ఒక వ్యాపారవేత్త జీవితం అతని ప్రియురాలి వేధింపుల కారణంగా విషాదాంతమైంది. తన కారులో తలకు బుల్లెట్‌ గాయంతో విగతజీవిగా కనిపించిన ఈ కేసులో, పోలీసులు అతని ప్రియురాలిని అరెస్ట్ చేశారు. మొదట ఆత్మహత్యగా భావించినా, ఇప్పుడు హత్య కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

ALSO READ: Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. యువకుడి ప్రాణం తీసిన పరోటా.. అసలు ఏం జరిగిందంటే..?

వివరాల్లోకి వెళ్తే, బీడ్ నివాసి అయిన గోవింద్ జగన్నాథ్ బార్గే, ఒక వ్యాపారవేత్త. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బార్గేకు ససురే గ్రామానికి చెందిన పూజ దేవిదాస్ గైక్వాడ్ అనే 21 ఏళ్ల లవణి నృత్యకారిణితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఈ సంబంధం పూజ వేధింపులకు దారితీసింది. గోవింద్ నుంచి డబ్బు, ఆభరణాలు తీసుకుంటూ, తనపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

ALSO READ: UP Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. 11 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి.. వీడియో వైరల్‌..!

ఈ వేధింపులతో తీవ్రంగా కలత చెందిన గోవింద్, తన బావ లక్ష్మణ్ జగన్నాథ్ చవాన్‌కు ఈ విషయం చెప్పాడు. తాజాగా, సోలాపూర్ లోని ససురే గ్రామంలో గోవింద్ కారులో అనుమానాస్పదంగా మరణించి కనిపించాడు. పోలీసులు కారులో ఒక పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

గోవింద్ మరణానికి పూజ వేధింపులే కారణమని అతని బావ ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూజ గైక్వాడ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్ట్ చేశారు. అయితే, గోవింద్ కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ALSO READ: Kukatpally Murder Case: పనివాళ్ల దారుణం.. మహిళ గొంతు కోసి, కుక్కర్‌తో కొట్టి హత్య..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad