Bengaluru Surgeon kills wife: బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భర్తే ఈ కేసులో నిందితుడనే అనుమానంతో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ALSO READ: Teacher viral video: టీచరమ్మా.. ఇదేమి బుద్ధి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
డాక్టర్ కృతికా రెడ్డి ఏప్రిల్ 21, 2025న అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అనారోగ్యంతో చనిపోయిందని భర్త డాక్టర్ మహేంద్రా రెడ్డి (31) అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. వైద్య పరీక్షల్లో మత్తు మందు (ప్రొపోఫాల్) అధిక మోతాదు శరీరంలోకి చేరటం వల్ల చనిపోయిందని తేలడంతో, కేసు అనుమానాస్పద మృతిగా కీలక మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6 నెలల తర్వాత అక్టోబర్ 15న మహేంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. హత్య తర్వాత, తన ప్రియురాలికి డిజిటల్ పేమెంట్ యాప్‌లో “నీ కోసం నా భార్యను చంపేశా” అని మహేంద్రా చేసిన మెసేజ్ తో అసలు విషయం బయటపడింది. వాట్సాప్, మెసేజ్‌లలో పంపితే ట్రేస్ అవుతుందని భయపడిన మహేంద్ర, పేమెంట్ యాప్‌లో పంపాడు. పోలీసులు ఈ మెసేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి… ప్రియురాలిని ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు
కృతికా మరణాన్ని అనారోగ్యంగా చూపించిన మహేంద్రా, ఇంట్లోనే చికిత్స చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. ఫోరెన్సిక్ రిపోర్టులో ప్రొపోఫాల్ (అనస్థీషియా మందు) ఓవర్‌డోస్ ఎక్కువైనట్లు తేలింది. మహేంద్రా డాక్టర్ కావడంతో, మత్తు మందు తేలికగా దొరికే అవకాశం ఉందని పోలీసులు అనుమానించారు. దర్యాప్తు ముమ్మరం చేసి “కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్ కు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు” అని ఇంట్లో తనిఖీలు చేపట్టి, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ ఇతర సమాచారం పంపారు. మహేంద్రాకు మరో మహిళతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణం ఏమిటి? మందు ఎలా సంపాదించాడు? మరో మహిళ పాత్ర ఎంత? అని పోలీసులు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇక ఈ కేసులో “మొత్తం దర్యాప్తు పూర్తి చేసి రిపోర్ట్ సమర్పిస్తాం” అని పోలీసులు తెలిపారు. కృతికా తల్లిదండ్రులు సైతం తమ కూతురు హత్యకు కారణమైన మహేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


