Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుMallapur: పరాయి దేశంలో ఆగిన వలసజీవి గుండె

Mallapur: పరాయి దేశంలో ఆగిన వలసజీవి గుండె

బహ్రెయిన్ లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య

ఉపాధి కోసం వలస వెళ్లి.. రేయనక, పగలనక.. అందర్నీ వదిలి పరాయి దేశం వెళ్లి కుటుంబాలను పోషిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఆత్మహత్య ఎంతోమంది చేసుకుంటున్నారు. కొత్త దామరాజ్ పల్లి గ్రామానికి చెందిన భోయిని అనిల్ (35) బహ్రేయిన్ కు గత 11 సంవత్సరాల క్రితం వెళ్లి అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అతనికి ఒక కూతురు కూడా ఉంది ఆర్థిక ఇబ్బందులతో, తీవ్రమైన పని ఒత్తిడితో మానసికంగా కృంగిపోయి అక్కడే తాను పనిచేస్తున్న స్థలంలో ఉరివేసుకొని గత మూడు రోజుల క్రిందట మృతి చెందాడు. అనిల్ మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబీకులు కన్నీరు మున్నిరవుతున్నారు… అనిల్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News