చిన్నపాటి భూమి సమస్య హత్యకు దారి తీసింది. భూమి సమస్య వల్ల అన్నని తమ్ముడు చంపిన ఘటన మండలంలోని ఓబులాపూర్ లో చోటుచేసుకుంది. డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన వడ్డెర కులనికి చెందిన పాలే సాయిలు, అతని తమ్ముడు చందుకి ఇంటి వద్ద భూమి సమస్యలున్నాయి. ఈ సమస్యపై గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు కుల సంఘం పెద్దమనుషులు పరిష్కారం చూపినా, భూ సమస్యలు సమసి పోలేదు.
స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నా సమస్యకు పరిష్కారం మార్గం ఒకరిపై ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు. భూమి సమస్య పరిష్కారం కాదేమోనని అన్నపై పెంచుకున్న కక్షతో ఆదివారం రోజున ఓబుళాపుర్ గ్రామ గోదావరి నది ఒడ్డు వద్ద సాయిని తల్వార్ తో నరకగా అక్కడికక్కడే మృతి చెందాడు. చందు పరారి అయినట్లు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు.
మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మర్డర్ తో ఓబులపుర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.