Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుMan Kills Father: ఆస్తి తగాదా.. తండ్రిని చంపి పక్కనే నిద్రపోయిన 19 ఏళ్ల యువకుడు

Man Kills Father: ఆస్తి తగాదా.. తండ్రిని చంపి పక్కనే నిద్రపోయిన 19 ఏళ్ల యువకుడు

Man Kills Father Over Property Dispute: ఆస్తి వివాదంపై 19 ఏళ్ల యువకుడు కన్న తండ్రిని ఇటుకతో కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత నిందితుడు రాత్రంతా మృతదేహం పక్కనే నిద్రపోవడం మరింత భయంకరంగా ఉంది.

- Advertisement -

ALSO READ: Crime : చేపల కూరకు చీమలు పట్టాయని తల్లిని చంపిన కొడుకు!

నోయిడాలోని సర్‌ఫాబాద్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి గౌతమ్ (43) అనే వ్యక్తి తన గదిలో మంచంపై నిద్రిస్తున్నాడు. అదే సమయంలో, అతని కుమారుడు ఉదయ్ (19) ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోయిన ఉదయ్, తండ్రి తలపై పదే పదే ఇటుకతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన గౌతమ్ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ: odisha crime: 11 ఏళ్ల బాలికపై కామాంధుల అఘాయిత్యం.. అణువణువూ గాయాలే!

హత్య తర్వాత కూడా పశ్చాత్తాపం లేకుండా, ఉదయ్ అదే గదిలో తన తండ్రి మృతదేహం పక్కన రాత్రంతా నిద్రపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదంతో పాటు, మద్యం, ఇతర రోజువారీ ఖర్చులకు డబ్బు ఇవ్వనందుకు కూడా తండ్రిని చంపినట్లు ఉదయ్ విచారణలో అంగీకరించాడు.

ఈ విషయం గౌతమ్ సోదరుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గౌతమ్‌ను అతని కుమారుడే చంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు తక్షణమే ఉదయ్‌ను అరెస్టు చేశారు. సెక్షన్ 103(1) ప్రకారం సెక్టార్ 113 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

పోలీసులు ఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన ఇటుకను, నిందితుడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కోసం కన్న తండ్రినే అతి క్రూరంగా చంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల కోసం తలెత్తే వివాదాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ALSO READ: Woman Gang Raped: పుట్టినరోజు పార్టీకి పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad