ఆలూరు సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న మోకిలా గ్రామానికి చెందిన ఆర్య నాయక్ తండి నంద్యా నాయక్ వయసు 40 సంవత్సరాలు శుక్రవారం హత్యకు గురయ్యడు. స్థానిక పోలీస్ లు శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం. ఆలూరు పాస్ట్ ఫుడ్ సెంటర్లో మాస్టర్ గా పనిచేస్తున్న సాగర్ మాన్సింగ్ సోదరి తండ్రి మాన్సింగ్ సోదరి వయసు 39 సంవత్సరాలు, సాగర్ మాన్సింగ్ సోదరిని కలవడానికి వచ్చిన వారి స్నేహితులు బినోద్ తప్ప తండ్రి హరిచంద్ర తప్ప వయసు 30, రమేష్ దమ్మి తండ్రి మన్ బాదర్ వయసు 28, ఉమేష్ భగవన్ జీ బండారి తండ్రి భగవాన్ జీ వయసు 34, ముగ్గురు స్నేహితుడు సోదరితో సహా నలుగురు శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా సబ్ స్టేషన్ ఆపరేటర్ కు ఒక రోజు షల్టర్ ఇవ్వమని చెప్పించగా ఫిబ్రవరి 21న బుధవారం బిహారిలకు షల్టర్ ఇచ్చారు.
ఫిబ్రవరి 22 గురువారం మధ్యాహ్నం వరకు పాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసి ఓనర్ లేకపోవడంలో మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసి వెళ్లిన బీహారీలు కల్లు మధ్యం సేవించి రాత్రి సమయంలో షల్టర్ కోసం మల్లి సబ్ స్టేషన్ కు వెళ్లారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ షల్టర్ ఇవ్వడానికి నిరకరించారు. మధ్యం మత్తులో ఉన్న బిహారిలు మృతుడు ఆపరేటర్ ఆర్య నాయక్ తో గొడవకు దిగారు. ఇదేశమయంలో మృత్తుడు శ్రీనివాస్ కు ఫోన్ చేసి మీవాళ్లు నాతో గొడవ పడుతున్నారని చెప్పాడు. శ్రీనివాస్ సబ్ స్టేషన్ వచ్చి చూడగా ఆర్య నాయక్ తల ఛిద్రమై రక్తపు మడుగులో పడిన్నాడు. ఈ విషయం పోలీస్ లకు విధ్యుత్ శాఖధికారు ఏఇకి చెప్పారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీస్ లు కేసు నమోదు చేసి నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్ డిసిపి శ్రీనివాస్ చేవెళ్ల డివిజన్ ఏసిపి కిషన్ పర్యవేక్షణలో కేసును చేదించారు.