Man On Bail Re-arrested For Harassing Same Victim: చిన్నారిని లైంగికంగా వేధించి అరెస్టు అయినా ఆ దుర్మార్గుడు తన బుద్ధి పోనిచ్చుకోలేదు. బెయిల్‌పై తిరిగొచ్చిన తర్వాత అదే బాలికను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని మరోసారి అరెస్టు చేశారు. ఈ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్‌లో జరిగింది.
నువగావ్‌కి చెందిన 27 ఏళ్ల కార్పెంటర్ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించసాగాడు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో పోలీసులు అతడిని పోక్సో, బీఎన్‌ఎస్ చట్టాలలోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
జైలుకెళ్లినా బుద్ధి మారలేదు..
దాదాపు నాలుగు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. అదే బాలికను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. ఆమె పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా వెంటబడి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని మళ్లీ అరెస్టు చేశారు. అతడు బాలికను వెంబడించడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
టీచర్‌పై అత్యాచారయత్నం..
మరో ఘటనలో సంస్కృతం పాఠాలు చెప్పే టీచర్‌పై అత్యాచారయత్నం చేశాడు ఓ కిరాతకుడు. ఒడిశాలోని గంజం జిల్లాకు చెందిన 27 ఏళ్ల టీచర్‌పై సంతోష్‌పుర్‌కు చెందిన జీవన్ మిశ్రా అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారిద్దరికీ గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. అది స్నేహంగా మారి అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
ఈ నెల 13న ఆమెను షాపింగ్‌కి ఆహ్వానించి బడా బజార్‌కి తీసుకెళ్లాడు జీవన్ మిశ్రా. ఆ తర్వాత తన ఆంటీ ఇంటికి తీసుకెళ్లి బాధితురాలిని అసభ్యంగా తాకి లైంగికంగా వేధించాడు. ఎలాగోలా తప్పించకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


