Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుUnnatural Act with Cow: గోవుతో 'అసహజ చర్య'.. వ్యక్తికి చెప్పుల దండ వేసి ఊరేగింపు

Unnatural Act with Cow: గోవుతో ‘అసహజ చర్య’.. వ్యక్తికి చెప్పుల దండ వేసి ఊరేగింపు

Man Paraded With Garland Of Shoes: గోవుతో అసహజ చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్ మాల్వా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి స్థానిక హిందుత్వ సంస్థ సభ్యులు చెప్పుల దండ వేసి, బహిరంగంగా గ్రామంలో ఊరేగించారు.

- Advertisement -

ALSO READ: school girls dead: ఆలస్యంగా స్కూల్‌కి వెళ్లిన బాలికలు.. టీచర్ తిరిగి పంపిస్తే బావిలో శవాలుగా..

ఈ ఘటన నలఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామీణ మార్కెట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ షాహిద్ (55) అనే వ్యక్తి సెప్టెంబర్ 9న గ్రామంలోని ఈద్గా వద్ద గోవుతో అసహజ కార్యానికి పాల్పడటం కొందరు స్థానికులు చూశారని తెలుస్తోంది.

పది రోజుల తర్వాత దారుణం:

అయితే, ఈ విషయంపై శనివారం నాడు స్థానిక హిందుత్వ సంస్థ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆ సంస్థ సభ్యులు మహ్మద్ షాహిద్‌ను పట్టుకుని, నినాదాలు చేస్తూ అతనికి చెప్పుల దండ వేసి, ఊరంతా ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ: Jumped From Train: ముంబై వెళ్తూ తప్పుడు రైలెక్కిన వ్యక్తి.. వేగంగా దూకుతూ అక్కడికక్కడే మృతి

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు అప్రమత్తమయ్యారు. షాహిద్‌ను వెంటనే బరాగావ్ పోలీస్ ఔట్‌పోస్ట్‌కు తరలించినట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ సర్దార్ సింగ్ పర్మార్ తెలిపారు. నిందితుడిని పోలీసులు ఊరేగించారనే వార్తలను ఆయన ఖండించారు.

కేసు నమోదు, జ్యుడీషియల్ కస్టడీ:

నలఖేడా స్టేషన్ ఇన్‌ఛార్జ్ నాగేశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడిపై జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం (Prevention of Cruelty to Animals Act)తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నోటీసు జారీ చేసిన అనంతరం, అతడిని తహశీల్దార్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోంది.

ALSO READ: SHOCKING MURDER : మద్యం కోసం మృగాడైన తండ్రి.. డబ్బులివ్వలేదని కన్నకూతురినే కడతేర్చాడు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad