Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుSuicide: భార్యపై అనుమానం, ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

Suicide: భార్యపై అనుమానం, ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

Man Poisons Children, Dies by Suicide: గుజరాత్‌లోని సూరత్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య అక్రమ సంబంధంపై అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

- Advertisement -

ఒత్తిడి తట్టుకోలేక..

దిండోలి పట్టణానికి చెందిన 41 ఏళ్ల ఆల్పేశ్‌భాయ్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తన భార్య ఫల్గుణిబాయ్‌కు నరేష్ కుమార్ రాథోడ్‌తో వివాహేతర సంబంధం ఉందని ఆల్పేశ్‌భాయ్ కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఈ అనుమానం అతన్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక, దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆల్పేశ్‌భాయ్ తన ఏడేళ్ల, రెండేళ్ల పిల్లలకు విషం ఇచ్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన రోజు ఇంటి తలుపులు లోపల నుంచి మూసి ఉండటంతో, కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, మంచంపై పిల్లలు నిర్జీవంగా పడి ఉన్నారు. పక్కనే ఆల్పేశ్‌భాయ్ మృతదేహం కనిపించింది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

డైరీలో వివరాలు..

ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీ చేయగా, ఓ సూసైడ్ నోట్, రెండు డైరీలు లభించాయి. ఆల్కేశ్‌భాయ్ మొబైల్‌లో కొన్ని వీడియోలు కూడా దొరికాయి. సూసైడ్ నోట్‌లో తన ఆవేదన, భార్యపై అనుమానాలు, అక్రమ సంబంధం గురించి స్పష్టంగా రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. డైరీలలో గత కొన్ని నెలలుగా ఆల్కేశ్‌భాయ్ తన మనసులోని భావాలను రాసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఆల్కేశ్‌భాయ్ భార్య ఫల్గుణిబాయ్‌తో పాటు, ఆమె ప్రియుడు నరేష్ కుమార్‌ రాథోడ్‌ను అరెస్టు చేశారు. ఈ విషాద ఘటన సూరత్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎలాంటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad