Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుHonour Killing : సూట్ కేస్ లో యువతి మృతదేహం.. వీడిన మిస్టరీ

Honour Killing : సూట్ కేస్ లో యువతి మృతదేహం.. వీడిన మిస్టరీ

ఇటీవల మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసులో యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. అది హత్య అని తేలింది. సూట్ కేస్ లో లభ్యమైన యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపించి.. యువతి తండ్రిని అరెస్ట్ చేసి, లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పరువు హత్యగా తెలిపారు.

- Advertisement -

యూపీ కి చెందిన నితీష్ యాదవ్ కుమార్తె ఆయుషీ. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. తండ్రి మాటను కాదని మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవడం ఆమె ఉసురు తీసింది. ఛాత్రపాల్ అనే యువకుడిని ఆయుషీ ప్రేమవివాహం చేసుకోవడంతో తండ్రి కోపంతో రగిలిపోయాడు. తన లైసెన్స్ డ్ గన్ తో కూతురిని కాల్చి చంపాడు. అందుకు ఆయుషీ తల్లి కూడా సహకరించింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేస్ లో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో విసిరేశారు. పోలీసులు నితీష్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు. అటు కూతుర్ని పోగొట్టుకుని, ఇటు భర్త జైలు పాలవ్వడంతో ఆ ఇల్లాలి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News