Man Stabs Brother To Death Over Property Dispute: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆస్తి వివాదం ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఓ వ్యక్తి తన అన్న, వదినను వారి చిన్న పిల్లల ముందే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
కూలీ పనులు చేసుకునే బబ్లూ చౌదరి, అతని అన్న, వ్యాపారి అయిన సంజయ్ చౌదరి మధ్య కుటుంబ పూర్వీకుల ఆస్తి పంపకాలపై చాలా నెలలుగా వివాదం నడుస్తోంది.
ALSO READ: Man Kills Wife: భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం.. చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భర్త
వీధిలోకి వచ్చి కూడా పొడిచాడు
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో బబ్లూ చౌదరి, సంజయ్ నివాసం ఉంటున్న బల్ది కోరి దఫై ప్రాంతంలోని అతని ఇంటికి వెళ్లి తన ఆస్తి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో బబ్లూ కత్తి తీసి సంజయ్‌ను పొడవటం మొదలుపెట్టాడు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, సంజయ్ గాయాలతో ఇంటి నుంచి బయటకు తూలుకుంటూ వస్తుండగా, బబ్లూ అతని వెనుకనే వచ్చి నేలపై పడిపోయిన తర్వాత కూడా పదేపదే పొడిచాడు. సంజయ్ భార్య (బబ్లూ వదిన) అడ్డుకోవడానికి ప్రయత్నించగా, బబ్లూ కత్తితో సంజయ్‌ను ముందు రెండుసార్లు, తర్వాత వెనుక భాగంలో పలుసార్లు పొడిచాడు.
పిల్లల ముందే వదినను హతమార్చి..
సంజయ్‌ను పలుసార్లు పొడిచిన తర్వాత, బబ్లూ చౌదరి ఇంట్లోకి పారిపోయిన తన వదినను వెంబడించి, ఆమె ఇద్దరు చిన్న పిల్లల ముందే అతి క్రూరంగా కత్తితో పొడిచి చంపాడు.
ALSO READ: Bus accident : ఆనంద యాత్ర విషాదాంతం.. బస్సు మంటల్లో సజీవ దహనమైన నెల్లూరు కుటుంబం!
ఈ దారుణం చేసిన అనంతరం బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సంజయ్, అతని భార్యను ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రతీక్ష మార్కో మాట్లాడుతూ, “ఇది దీర్ఘకాలంగా నడుస్తున్న ఆస్తి వివాదం కారణంగా జరిగిన క్రూరమైన చర్య. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశాం. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చుట్టుపక్కల జిల్లాల్లో గాలిస్తున్నాం. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తాం” అని తెలిపారు.
ALSO READ: Kaveri Travels Bus Accident: పండక్కి ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ..సజీవదహనమైన యాదాద్రి యువతి!

